‘RC 16’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!

X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 16’ పై అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రేపు ఉదయం 9:09 కి చరణ్ బర్త్ డే స్పెషల్ గా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించడంతో, అంచనాలు మరింత పెరిగాయి.
క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడు గా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పొడవైన జుట్టు, గడ్డంతో చరణ్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఫస్ట్ లుక్‌తో ఆ అంచనాలు మరో స్థాయికి చేరుకోవడం ఖాయం.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం, ఏ.ఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Next Story
-
Home
-
Menu