సుకుమార్‌పై రాయుడు కామెంట్ – సోషల్ మీడియా ఫైర్!

భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరమైనదే. కానీ, నిన్నటి మ్యాచ్‌లో క్రికెట్ కన్నా కామెంట్రీ చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించడానికి తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ కుటుంబం, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెలా తదితరులు స్టేడియంలో కనిపించగా, కెమెరాలు వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి.
కామెంట్రీ సందర్భంగా, స్క్రీన్‌పై దర్శకుడు సుకుమార్ కనిపించగానే ఒక కామెంటేటర్ 'ప్రైడ్ ఆఫ్ తెలుగు' అంటూ ప్రశంసించారు. అయితే కామెంట్రీ బాక్సులో ఉన్న అంబటి రాయుడు మాత్రం 'ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్' అందుకే వస్తారంటూ చాలా చీప్ కామెంట్స్ చేశాడు.
ఈ వ్యాఖ్యతో రాయుడిపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'సుకుమార్ లాంటి గొప్ప దర్శకుడు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏముంది?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి లాంటి దిగ్గజం కెమెరా ఫోకస్ కోసం దుబాయ్ వెళ్ళాలా? అంటూ మెగాఫ్యాన్స్ కూడా రాయుడిని టార్గెట్ చేస్తున్నారు.
సామాన్యంగా క్రికెటర్లు, సినీ ప్రముఖులు మ్యాచ్‌లకు హాజరయ్యే విషయం కొత్తేమీ కాదు. కానీ, ఓ తెలుగు మాజీ క్రికెటర్‌గా, సాటి తెలుగువారిపై రాయుడు చేసిన ఈ వ్యాఖ్య అనవసరమైన వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌పై రాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
-
Home
-
Menu