రా అండ్ రస్టిక్ గా 'ది ప్యారడైజ్' స్టేట్‌మెంట్!

రా అండ్ రస్టిక్ గా 'ది ప్యారడైజ్' స్టేట్‌మెంట్!నేచురల్ స్టార్ నాని అంటే ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలే గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎక్కువగా మురిపించిన నానిని ‘దసరా‘ సినిమాతో ఊర మాస్ గా ప్రెజెంట్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న 'ది ప్యారడైజ్' కోసం మరింత వైలెంట్ గా సందడి చేస్తున్నాడు నాని. ‘దసరా‘కి ఎన్నో రెట్లు మించిన రీతిలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది టీమ్. లేటెస్ట్ గా రిలీజైన 'ది ప్యారడైజ్' రా స్టేట్‌మెంట్ చూస్తే అది నూటికి నూరు పాళ్లు నిజమనిపిస్తుంది.
ఇప్పటివరకూ నానిని చూడని యాంగిల్ లో బోల్డ్ అండ్ వైల్డ్ లుక్ లో 'ది ప్యారడైజ్' కోసం ప్రెజెంట్ చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. 'ది ప్యారడైజ్' రా స్టేట్‌మెంట్ గ్లింప్స్ విషయానికొస్తే.. పలు భాషల్లో ఇది విడుదలైంది. 'చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు గానీ.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు' అంటూ చెబుతూనే 'ఇది కడుపు మండిన కాకుల కథ, జమాన మజాన నుంచి నడిచే శవాల కథ' అంటూ ఆ జాతిని ఉద్దరించడానికి పుట్టిన హీరోగా నానిని పరిచయం చేసిన తీరు ఎంతో రా గా ఉంది.
అసలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే ఇంత రస్టిక్ క్యారెక్టరైజేషన్ తో సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. మొత్తంగా 'దసరా' కాంబో 'ది ప్యారడైజ్'తో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు ఈ గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ఎస్.ఎల్.వి. సినిమాపై రూపొందుతున్న 'ది ప్యారడైజ్' వచ్చే యేడాది మార్చి 26న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu