పుట్టినరోజు వేడుకల్ని ఇలా ప్లాన్ చేసిందా?

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న తన 29వ పుట్టినరోజు వేడుకల కోసం ఒమాన్ వెళ్లింది. పుట్టినరోజుకి ఒక రోజు ముందే ఈమె ఒమాన్‌కి చేరుకుంది. అక్కడి రిసార్ట్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత తన పిక్చర్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. రష్మిక ప్రస్తుతం "అల్ బలీద్ సలాలా బై అనంతారా" అనే లగ్జరీ రిసార్ట్‌లో ఉంటోంది. ఈ ఎడారి దేశంలో తన స్నేహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపనుంది.
ఆమె ప్రియుడిగా వార్తల్లో నిలుస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా శనివారం ఒమాన్‌కి చేరే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం అతడు "కింగ్‌డమ్" అనే సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. రిసార్ట్‌లోని పూల్ సైడ్ రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం చేస్తూ తీసుకున్న ఫొటోలు రష్మిక షేర్ చేసింది. "ఇంత బాగా తిన్నాను... నేను తిన్న ఈ తిండికి నా ట్రైనర్స్ చూస్తే నన్ను కోప్పడతారేమో!" అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది.
ఇటీవలి కాలంలో రష్మిక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. “యానిమల్”, “పుష్ప 2”, “ఛావా” వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆమె తాజాగా నటించిన బాలీవుడ్ మూవీ “సికందర్” మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. తన పుట్టినరోజు వేడుకల్లో మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేయబోతున్న రష్మికకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
Home
-
Menu