వ్యాపార రంగంలోకి రష్మికా మందన్న

వ్యాపార రంగంలోకి రష్మికా మందన్న
X
రష్మికా మందన్నా ఇప్పుడు ఒక ఎంట్రప్రెన్యూర్ అవతారంలోకి మారబోతోంది. ఈ ఎక్సైటింగ్ జర్నీ గురించి ఆమె తన ఫ్యాన్స్‌కి ఒక గ్లింప్స్ ఇచ్చింది.

'యానిమల్', 'పుష్ప 2' వంటి మెగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆమె తనకంటూ ఒక గట్టి ముద్ర వేసుకుంది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. కానీ.. ఇప్పుడు ఈ స్టార్ బ్యూటీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఒక కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది .. అదే వ్యాపార రంగంలోకి. రష్మికా మందన్నా ఇప్పుడు ఒక ఎంట్రప్రెన్యూర్ అవతారంలోకి మారబోతోంది. ఈ ఎక్సైటింగ్ జర్నీ గురించి ఆమె తన ఫ్యాన్స్‌కి ఒక గ్లింప్స్ ఇచ్చింది. తాజాగా.. రష్మికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సూపర్ ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది.

ఇది ఆమె తన తల్లితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సీన్. ఈ వీడియోలో రష్మికా ఫుల్ ఎనర్జీ, ఎమోషన్‌తో కనిపించింది. ఆమె తన తల్లితో .... "అమ్మా, ఈ రోజు నేను ఒక సూపర్ ఇంపార్టెంట్ షూట్‌లో ఉన్నాను. నువ్వు ఒకసారి నాతో చెప్పిన ఆ బిజినెస్ ఐడియా గుర్తుందా? నేను ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నాను! నువ్వు చూస్తావు. నేను దీన్ని బిగ్ హిట్ చేస్తాను.." అంటూ .. ఆమె గొంతులో ఉన్న ఆ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఫ్యాన్స్‌ని కూడా ఇన్‌స్పైర్ చేసేలా ఉంది.

దీనికి ఆమె తల్లి.. ఎప్పటిలాగే సపోర్టివ్‌గా.. ఒక గోల్డెన్ అడ్వైస్ ఇస్తూ ... "మంచి పనులు చేస్తే, మంచి ఫలితాలే వస్తాయి.. " అంటూ ఆమె తల్లి అన్న మాటలు రష్మికాకి మరింత బూస్ట్ ఇచ్చినట్లు కనిపించాయి. ఈ ఇద్దరి సంభాషణ చూస్తే.. ఎవరికైనా హార్ట్‌టచింగ్ మూమెంట్‌గా అనిపిస్తుంది. కానీ, రష్మికా తన బిజినెస్ వెంచర్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఇది ఏ రంగంలోని బిజినెస్? ఫ్యాషన్, బ్యూటీ, టెక్, లేక వేరే ఏదైనా క్రియేటివ్ ఐడియానా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags

Next Story