రష్మిక బర్త్‌డే – విజయ్ సర్ప్రైజ్ తో మరింత స్పెషల్?

నేషనల్ క్రష్, మల్టీ లాంగ్వేజ్ స్టార్, యూత్ ఐకాన్.. ఇలా రష్మిక మందన్నకు ఎన్నో పేర్లు. ఈరోజు రష్మిక పుట్టినరోజు. ప్రస్తుతం తన 29వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటుంది రష్మిక. ఈరోజు రష్మిక బర్త్ డే స్పెషల్ గా ఆమె ప్రేమ జీవితం గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది.
తాజాగా ఓ ప్రత్యేకమైన లొకేషన్ ఒమన్ లో ఆమె సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా అక్కడే ఉన్నాడని టాక్. వీళ్లిద్దరి మధ్య బలమైన బాండింగ్ ఉన్నట్లు ఇప్పటివరకు ఎన్నో సందర్భాలు చెప్పాయి. దీపావళి వేడుకల్లో విజయ్ ఇంట్లో ఆమె పాల్గొనడం, ‘పుష్ప 2’ సినిమాను విజయ్ కుటుంబంతో కలిసి వీక్షించడం, ఇప్పుడు బర్త్‌డే వేళ విదేశాల్లో వీరిద్దరూ కలిసి వున్నారన్న వార్తలు.
ఇక కెరీర్ పరంగా చూసుకుంటే, రష్మిక వరుసగా ‘యానిమల్, పుష్ప 2, ఛావా‘ వంటి మూడు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఈ మూడు సినిమాలు వసూళ్ల పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయితే ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ‘సికందర్‘ నిరాశపరిచిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘కుబేర‘ చిత్రాలలో నటిస్తుంది. ఇంకా హిందీలోనూ పలు సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.
-
Home
-
Menu