అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడట !

అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడట !
X
కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చి, నిర్మాణంలో బిజీగా ఉంటూ ఇతర ప్రాజెక్ట్‌లకు సపోర్ట్ చేశాడు. ఈ గ్యాప్‌లో అతడు ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ముందుకు సాగలేదు. ఇప్పుడు రానా సోలో హీరోగా గట్టిగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

‘బాహుబలి’, ‘భీమ్లా నాయక్’, ‘ఘాజీ అటాక్’ లాంటి సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు రానా దగ్గుబాటి. కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చి, నిర్మాణంలో బిజీగా ఉంటూ ఇతర ప్రాజెక్ట్‌లకు సపోర్ట్ చేశాడు. ఈ గ్యాప్‌లో అతడు ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ముందుకు సాగలేదు. ఇప్పుడు రానా సోలో హీరోగా గట్టిగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అతడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘కాంత’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అలాగే, శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర డైరెక్షన్‌లో ‘పరాశక్తి’లో నటిస్తున్నాడు.

రానా మళ్లీ లీడ్ యాక్టర్‌గా ఫుల్ ఫోకస్‌లో ఉన్నాడు. గతంలో అతడు ప్లాన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్‌లు షూటింగ్ స్టేజ్‌కు వెళ్లకుండానే రద్దయ్యాయి. అయితే, ‘హిరణ్య కశ్యప’ అనే భారీ స్కేల్ మూవీపై రాణా ఫోకస్ చేస్తున్నాడు, కానీ దీనికి ఇంకా ప్రీ-ప్రొడక్షన్‌లో సమయం కావాలి. అలాగే.. శేఖర్ కమ్ములతో ‘లీడర్ 2’ గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఈ ప్రాజెక్ట్ షేప్ అవ్వడానికి కొంత టైమ్ పట్టొచ్చు.

నటనతో పాటు.. రాణా కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను కో-ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 2026లో మరిన్ని ప్రాజెక్ట్‌లతో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నాడు. బ్రేక్ తర్వాత, కొన్ని సెట్‌బ్యాక్‌లను ఎదుర్కొన్నా.. రానా దగ్గుబాటి ఇప్పుడు గట్టి కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు.

Tags

Next Story