ఈ వార్తలో నిజానిజాలేంటి?

‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్ హాట్ డైరెక్టర్ అట్లీతో జోడీ కట్టాడు. ఈసారి ఓ సై-ఫై ఫాంటసీ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. అట్లీ తన రెగ్యులర్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాను మాసివ్‌గా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాకు భారీ బడ్జెట్‌తో బ్యాకింగ్ ఇస్తోంది.
దీపికా పదుకొణె ఈ మూవీలో లీడ్ హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది, అధికారికంగా కన్ఫర్మ్ కూడా చేశారు. ఇంకా.. టాక్ ప్రకారం మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్న కూడా ఈ బిగ్గీలో కీలక రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఇంక లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే.. స్టార్ యాక్టర్ రమ్య కృష్ణని కూడా ఓ క్రూసియల్ రోల్ కోసం తీసుకున్నారట.
రమ్య కృష్ణ ఇంతకు ముందు అట్లీ లేదా అల్లు అర్జున్‌తో వర్క్ చేయలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే.. సినీ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ ఖుషీ మామెంట్ అవుతుంది. ఈ వీఎఫెఎక్స్ లోడెడ్ యాక్షన్ స్పెక్టాకిల్ 2026లో థియేటర్స్‌లో సందడి చేయనుంది.
-
Home
-
Menu