‘పెద్ది’ సెకండ్ లుక్ ఇదేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ చేంజర్” విడుదల తర్వాత పూర్తిగా మారిపోయాడు. “పెద్ది” సినిమాలోని గ్రామీణ క్రీడాకారుడి పాత్ర కోసం గడ్డం, జుట్టు పెంచి రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ను మొదట టీజర్‌లో వెల్లడించారు. ఇప్పుడు కొత్త టాక్ ఏంటంటే.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు.
ఇటీవల సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో అతను కనిపించడం, కొత్త హెయిర్‌స్టైల్ గురించి చర్చిస్తున్న వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు ఆకర్షణీయ లుక్స్‌లో కనిపిస్తాడని ఊహాగానాలు చేస్తున్నారు.
ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. రామ్ చరణ్ రెండో మేకోవర్ గురించి వస్తున్న టాక్ బుచ్చిబాబు సానా అంబిషియస్ విజన్, రామ్ చరణ్ పవర్‌ఫుల్ రోల్‌పై ఆసక్తిని మరింత పెంచింది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న “పెద్ది” సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏ.ఆర్. రహమాన్ సంగీతం సమ కూరుస్తున్నారు.
-
Home
-
Menu