డ్రగ్స్ కు వ్యతిరేకంగా మనమంతా ఉద్యమించాలి : రామ్ చరణ్

తెలంగాణ ప్రభుత్వం జూన్ 26న ఇంటర్నేషనల్ డే అగైన్‌స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిపిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో స్టార్ గెస్ట్‌గా హాజరయ్యారు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా విచ్చేస్తే.. రామ్‌చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా సెలబ్రిటీ అంబాసిడర్‌లుగా సందడి చేశారు.
ఈ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు, ఇది కార్యక్రమానికి మరింత గ్లామర్ జోడించింది. స్టేజ్‌పైకి వచ్చిన రామ్‌చరణ్.. తన స్పీచ్‌లో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. "ముందుగా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బిగ్ థ్యాంక్స్. నా బ్రదర్ విజయ్ దేవరకొండ, దిల్ రాజు గారు, గోపీచంద్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ చూస్తుంటే, నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇంత అద్భుతమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నా స్పెషల్ థ్యాంక్స్. ఈ రకమైన ఇనిషియేటివ్‌లు యూత్‌ని సరైన దారిలో నడిపించడానికి సూపర్ ఇంపార్టెంట్," అని రామ్‌చరణ్ ఎమోషనల్‌గా చెప్పారు.
ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చెప్పిన పాయింట్స్‌ని సపోర్ట్ చేస్తూ రామ్‌చరణ్ స్పందించారు... "విజయ్ చెప్పినట్టు, రోజు ఉదయం లేచి కొంచెం వర్కౌట్ చేసి, ఉత్సాహంగా జాబ్‌కి వెళ్లి, సాయంత్రం ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేసి, రాత్రి హాయిగా నిద్రపోవడం... ఇదే రియల్ హై... డ్రగ్స్‌తో వచ్చే ఫేక్ హై కంటే.. ఈ నిజమైన ఆనందమే మనం ఫాలో చేయాల్సిన లైఫ్‌స్టైల్..’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయ్ దేవరకొండ కూడా తన స్పీచ్‌లో ఫుల్ ఎనర్జీతో స్పందించారు. "తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాంటీ-డ్రగ్ ఇనిషియేటివ్‌కి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడానికి, డ్రగ్-ఫ్రీ లైఫ్‌స్టైల్‌ని ప్రమోట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. యూత్‌ని ఈ సోషల్ కాజ్‌లో ఇన్‌వాల్వ్ చేయడం కోసం నేను నా వంతు కృషి చేస్తాను," అని విజయ్ హామీ ఇచ్చారు. ఈ ఈవెంట్, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యూథ్‌లో అవేర్‌నెస్ పెంచడానికి, హెల్దీ లైఫ్‌స్టైల్‌ని ఎంకరేజ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ స్టెప్‌గా నిలిచింది. రామ్‌చరణ్, విజయ్ లాంటి స్టార్స్ ఇలాంటి సోషల్ కాజ్‌లకు సపోర్ట్ చేయడం యూత్‌కి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తోంది.
-
Home
-
Menu