గ్లోబల్ స్టార్ సినిమాల లైనప్ ఇదే !

గ్లోబల్ స్టార్  సినిమాల లైనప్ ఇదే !
X
మొత్తంగా చూస్తే, రామ్ చరణ్ “పెద్ది” తర్వాత నిఖిల్ నగేష్ భట్, సుకుమార్‌లతో రెండు బిగ్ ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయ్యాడు.

గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి నడుస్తోంది. రకరకాల ప్రాజెక్టుల గురించి రూమర్స్.. ఫుల్ స్పీడ్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని గట్టిగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు వట్టి రూమర్స్ గా తేలాయి. ఎందుకంటే, అల్లు అర్జున్ తన నిర్ణయంలో క్లారిటీ ఇవ్వకుండా టైమ్ తీసుకోవడంతో.. త్రివిక్రమ్ డైరెక్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జతకట్టి.. ఓ పౌరాణిక సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చేశారు. ఈ ట్విస్ట్‌తో అభిమానులు కాస్త షాక్ అయ్యారు, అదే టైమ్‌లో రామ్ చరణ్ “పెద్ది” తర్వాత ఏ సినిమాలు చేయబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అతడి లైనప్ గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో “పెద్ది” అనే స్పోర్ట్స్ డ్రామాలో బిజీగా ఉన్నాడు. 2026 మార్చిలో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక “పెద్ది” తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్ చేయ బోతున్నట్టు టాక్. “కిల్” అనే యాక్షన్ థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేశాడు నిఖిల్. కొన్ని రోజుల క్రితం నిఖిల్, రామ్ చరణ్‌తో ఓ స్క్రిప్ట్ డిస్కస్ చేశాడట. ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కాంబో గురించి వినగానే ఫ్యాన్స్ హైప్ మీద ఉన్నారు. ఎందుకంటే “కిల్” సినిమా తెలుగు ఆడియన్స్‌లో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది.

అదే సమయంలో, రామ్ చరణ్ తన మాస్టర్ డైరెక్టర్ సుకుమార్‌తో మరో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది కానీ, స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే వరకు షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. సుకుమార్-రామ్ చరణ్ కాంబో అంటే “రంగస్థలం” లాంటి బ్లాక్‌బస్టర్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే, రామ్ చరణ్ “పెద్ది” తర్వాత నిఖిల్ నగేష్ భట్, సుకుమార్‌లతో రెండు బిగ్ ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయ్యాడు.

Tags

Next Story