బ్రాండ్ అంబాసిడర్ గా గ్లోబల్ స్టార్

బ్రాండ్ అంబాసిడర్ గా  గ్లోబల్ స్టార్
X
దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రామ్ చరణ్‌తో రిలయన్స్ కలయిక, బ్రాండ్‌కు మరో కీలక మైలురాయిగా మారిందని భావిస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో భాగస్వామిగా మారాడు. రిలయన్స్‌కి చెందిన ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా’ కు అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది. 2023 మార్చిలో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కాంపా... భారత్‌లోని పోటీభరిత బీవరేజ్ రంగంలో వేగంగా ఎదుగుతోంది.

ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రామ్ చరణ్‌తో రిలయన్స్ కలయిక, బ్రాండ్‌కు మరో కీలక మైలురాయిగా మారిందని భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా “కాంపా వాలి జిద్ద్” అనే థీమ్‌తో రామ్ చరణ్‌ పై ప్రత్యేకంగా రూపొందించిన యాడ్ ఒకటి విడుదలైంది. ఈ ప్రచార కార్యక్రమం ఐపీఎల్, డిజిటల్ మీడియా, టెలివిజన్ చానెళ్లు, మొబైల్ ప్లాట్‌ఫారములు వంటి అనేక వేదికలపై ప్రసారం చేయబోతున్నారు.

ఈ కొత్త ప్రచారంతో కాంపా మార్కెట్లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటుందని అంచనా. రామ్ చరణ్ ఆకర్షణతో యువతను టార్గెట్ చేస్తూ బ్రాండ్ మరింత ప్రజాదరణ పొందే అవకాశాలున్నాయి.

Tags

Next Story