మళ్లీ రామ్ చరణ్ - సమంత జోడీ ?

తన ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఆమె నటించిన కొన్ని చిత్రాలలో.. ముఖ్యంగా రామ్ చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘రంగస్థలం’లో వీరిద్దరి జంట ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించడంతో, మరోసారి ఈ జోడీ తెరపై కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇటీవల, సమంత సిడ్నీలో జరిగిన ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ అభిమానులు ఆమెను రామ్ చరణ్‌తో మరోసారి నటించాలని కోరగా, ఆమె చిరునవ్వుతో "నేనే కాల్ చేస్తా" అంటూ స్పందించారు. ఇది మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వి కపూర్‌తో కలిసి RC16 లో నటిస్తున్నారు.
ఆ తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో RC17 చేయనున్నారు. ఈ చిత్రానికి కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంత తన వ్యక్తిగత ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ‘ఖుషి’ తర్వాత ఆమె ఏ తెలుగు సినిమా చేయలేదు. అయితే, ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెర ముందు కాకపోయినా, సమంత ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
మరోవైపు, RC17 సమంత-రామ్ చరణ్ జంటకు మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. నిజంగా ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపిస్తే, అది అభిమానులకు పండగే అవుతుంది.
-
Home
-
Menu