ఇన్ స్టా గ్రామ్ లో అదరగొడుతోన్న రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తన స్టార్ హవా సినిమా స్క్రీన్‌కి మాత్రమే పరిమితం కాదని మరోసారి నిరూపించాడు. తెలుగు సినిమాల్లో తన సహజమైన నటన, హై-వోల్టేజ్ స్టైల్‌తో ఎనర్జీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్.. సోషల్ మీడియాలో మళ్లీ సందడి చేస్తున్నాడు. మాస్ హెవీ ఎక్స్‌పెరిమెంట్స్‌తో కొన్ని సెట్‌బ్యాక్‌ల తర్వాత.. రామ్ కంటెంట్ రిచ్ రోల్స్ వైపు ఫోకస్ మార్చాడు.
మహేష్ బాబు పి డైరెక్షన్‌లో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అతని కొత్త సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలోని ‘నువ్వుంటే చాలే’ అనే పాట.. రామ్ స్వయంగా రాసిన లిరిక్స్‌తో, ఫ్యాన్స్ హృదయాల్ని కొల్లగొట్టింది. అతని ఆన్‌లైన్ ప్రెజెన్స్‌ని మరింత బూస్ట్ చేసింది. తాజాగా, రామ్ ఈ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్ పోస్ట్ చేశాడు. అది ఇన్‌స్టంట్‌గా వైరల్ అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ పోస్ట్ 10 మిలియన్ లైక్స్ దాటేసింది. తెలుగు స్టార్స్ లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించిన పిక్‌గా నిలిచింది. ఈ రికార్డ్ విజయ్ దేవరకొండ 6 మిలియన్ లైక్స్ రికార్డ్‌ని బద్దలు కొట్టింది. ఈ మైలురాయి రామ్ పోతినేని పాపులారిటీ ఆకాశాన్ని అంటుతోందని, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 2025 రిలీజ్‌కి ముందు ఫ్యాన్స్‌తో అతని కనెక్ట్ మరింత బలంగా ఉందని నిరూపిస్తోంది.
-
Home
-
Menu