రామ్ చిత్రానికి వెరైటీ టైటిల్ !

రామ్ చిత్రానికి వెరైటీ టైటిల్ !
X
రామ్ కొత్త సినిమాకి సంబంధించి మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తూ, టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి “ఆంధ్ర కింగ్ తలూకా” అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఇండస్ట్రీలో ఎనర్జీకి మారుపేరు రామ్ పోతినేని. క్లాస్ కి తగిన స్టైల్ ఉన్నా, మాస్ కి కావలసిన అటిట్యూడ్ ఉన్న రామ్.. ఈరోజు తన పుట్టినరోజు జరుపు కుంటు న్నాడు. ఈ సందర్భంగా అతడి కొత్త సినిమాకి సంబంధించి మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తూ, టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి “ఆంధ్ర కింగ్ తలూకా” అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ గ్లింప్స్ చూస్తే, కథ 2000 ల ప్రారంభంలో ఫిక్స్ అయ్యింది అనే విషయం స్పష్టమవుతోంది. కథ చుట్టూ తిరిగే ప్రధాన అంశాలు ఫ్యాన్ కల్చర్, సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకునే సంఘటనలు. ముఖ్యంగా, ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ టాప్ హీరో పాత్రలో కనిపించనున్నారు. అంటే, సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలోనూ, బైట జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశమని అర్ధమవుతోంది.

టైటిల్‌ను పరిశీలిస్తే, పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కు రిఫరెన్స్ ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్ ఎంత క్యాచీగా ఉందో, “బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్” అనే ట్యాగ్ లైన్ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది . రామ్ పోతినేని ఇందులో ఓ స్టార్ హీరోకి వీరాభిమాని పాత్రలో మారిపోయాడు. గ్లింప్స్‌లో ఆయన పాత్రలోకి ఒదిగిపోయిన తీరు, భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న పి. మహేశ్ బాబు.. గతంలో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” వంటి ఫీల్‌గుడ్ హిట్ ఇచ్చిన యంగ్ టాలెంటెడ్. ఈసారి పక్కా మాస్ అండ్ నోస్టాల్జిక్ ఎలిమెంట్స్ కలిపిన కథతో వస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తున్నారు. సంగీతానికి వివేక్–మెర్విన్ ద్వయం పనిచేస్తున్నారు. వీరికి ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “ఆంధ్ర కింగ్ తలూకా” 2025 ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదల కానుంది.



Tags

Next Story