రామ్ తో ‘బాహుబలి’ మేకర్స్ సినిమా

రామ్ తో ‘బాహుబలి’ మేకర్స్ సినిమా
X
రామ్ పోతినేని డెబ్యూ డైరెక్టర్ కిషోర్ గోపుతో కలిసి బాహుబలి ప్రొడక్షన్ హౌస్ అర్కా మీడియా వర్క్స్ బ్యాకింగ్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కొత్త సినిమా ‘ఆంధ్రా కింగ్ తలూకా’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 28, 2025న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో సినీ స్టార్స్ పట్ల ఉన్న క్రేజీ ఫ్యాన్ కల్చర్‌ని చూపించే ప్రయత్నమే ఈ చిత్రం.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని డెబ్యూ డైరెక్టర్ కిషోర్ గోపుతో కలిసి బాహుబలి ప్రొడక్షన్ హౌస్ అర్కా మీడియా వర్క్స్ బ్యాకింగ్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్ పోతినేని పూర్తి ఫోకస్ ‘ఆంధ్రా కింగ్ తలూకా’ మూవీ మీదే ఉంది. గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, ఈ సినిమా పర్ఫెక్ట్‌గా రావాలని రామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Tags

Next Story