కోలీవుడ్ లో ‘రాజా సాబ్’ కు గట్టి పోటీ

కోలీవుడ్ లో ‘రాజా సాబ్’ కు గట్టి పోటీ
X
దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ జనవరి 14న విడుదలవుతోంది. ఇక ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా మొదట ఈ డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే.. తమిళనాట ఈ సినిమాకి రెండు భారీ తమిళ చిత్రాలతో పోటీ ఎదురవ్వొచ్చు. సాధారణంగా, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్థానిక తమిళ సూపర్‌స్టార్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారు.

దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ జనవరి 14న విడుదలవుతోంది. ఇక ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. నిర్మాత జనవరి 9ని ప్రకటించినప్పటికీ.. సంక్రాంతి సీజన్‌లో ఫైనల్ రిలీజ్ డేట్ ఎలా ఉంటుందనేది చూడాలి.

తెలుగులో ఇప్పటికే సంక్రాంతికి బోలెడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ప్రభాస్ స్టార్‌డమ్ వల్ల తెలుగులో ఈ పోటీని అధిగమించవచ్చు, కానీ తమిళనాడులో ‘రాజా సాబ్’ కు తగినన్ని థియేటర్లు దొరకడం కష్టంగా మారవచ్చు. ఎందుకంటే విజయ్, శివ కార్తికేయన్ సినిమాలు ఆ సమయంలో రిలీజవుతున్నాయి.

ప్రభాస్ కు పాన్-ఇండియా స్టార్‌గా తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నాడు. అయినప్పటికీ, విజయ్, ఎమర్జింగ్ స్టార్ శివ కార్తికేయన్‌ల సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి, ‘రాజా సాబ్’ టీమ్ ఎక్కువ థియేటర్లు సంపాదించడానికి ఏదైనా స్పెషల్ స్ట్రాటజీ అవలంబించాలి. అలాగే సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా కీలకం. సాధారణంగా, సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ డ్రామాలు బాగా ఆడతాయి. కానీ ‘రాజా సాబ్’ హారర్ జానర్‌లో ఉంది. ఈ జానర్ ఫెస్టివల్ సీజన్‌లో ఎంతవరకు ఆడుతుందనేది చూడాలి.

Tags

Next Story