‘రాజా సాబ్‘ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం!

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్‘ సినిమా ఏప్రిల్ 10న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే ఇంకా మూడు పాటల చిత్రీకరణ, కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలి ఉందట. డైరెక్టర్ మారుతి తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తాడు. అయితే ఈ చిత్రం ఆద్యంతం విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయట.
ప్రభాస్ ‘ఫౌజీ‘ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న తర్వాత ‘రాజా సాబ్‘ మిగతా భాగాన్ని పూర్తి చేయనున్నాడట. దీంతో ఏప్రిల్ లో ‘రాజా సాబ్‘ వచ్చే అవకాశం లేదు. మరోవైపు వచ్చే నెలలోనే భారీ ఎత్తున ఈ మూవీ టీజర్ లాంఛ్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ఈ ఈవెంట్ ద్వారా ‘రాజా సాబ్‘ కొత్త తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారట. దీంతో ఈ సినిమాపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టినట్టు అవుతుంది.
‘ది రాజా సాబ్‘లో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సంజయ్ దత్ తాతయ్య పాత్రలో కనిపించనున్నాడట. హీరోయిన్‌లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. మొత్తంగా ‘కల్కి‘ వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ‘ది రాజా సాబ్‘ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
-
Home
-
Menu