సమంత నెక్స్ట్ మూవీకి రాజ్ టచ్ !

సమంత నెక్స్ట్ మూవీకి రాజ్ టచ్ !
X
ఈ చిత్రానికి రాజ్ అండ్ డీకే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా, నందిని రెడ్డి, సమంత గతంలో ‘జబర్దస్త్’ అండ్ ‘ఓ బేబీ’ చిత్రాలకు కలిసి పనిచేశారు.

సమంత ప్రస్తుతం ముంబైలో ఉంటూ హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ముఖ్యంగా దర్శకుల ద్వయం రాజ్, డీకేతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. వీరి ప్రాజెక్టులలోనే ఆమె ఎక్కువగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో సమంత, రాజ్ మధ్య డేటింగ్ పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పుకార్ల మధ్యే సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఒక తెలుగు సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు దర్శకురాలిగా నందిని రెడ్డిని సమంతే సూచించిందని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి రాజ్ అండ్ డీకే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా, నందిని రెడ్డి, సమంత గతంలో ‘జబర్దస్త్’ అండ్ ‘ఓ బేబీ’ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇది వీరిద్దరి మూడో చిత్రం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Tags

Next Story