‘పెద్ది’ మూవీకి ఆ ఫైట్ సీనే హైలైట్ !

‘పెద్ది’ మూవీకి ఆ ఫైట్ సీనే హైలైట్ !
X
ఓ కీలక ఫైట్ సీన్ రైల్వే స్టేషన్ సెట్‌లో తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ కావడంతో పాటు, కథలో టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని సమాచారం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి భారీ సినిమా "పెద్ది" ప్రేక్షకుల్లో ఎంతగానో ఆసక్తిని రేపుతోంది. చెర్రీ బర్త్ డేకి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌తోనే అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. రామ్ చరణ్ లుక్‌ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించి, సినిమాపై హైప్‌ని రెట్టింపు చేసింది. అతడి మేకోవర్ కు మంచి అప్లాజ్ లభించింది. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ ప‌రిస‌రాల్లో ఉత్సాహభరిత షెడ్యూల్‌ జరుగుతోంది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఓ కీలక ఫైట్ సీన్ రైల్వే స్టేషన్ సెట్‌లో తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ కావడంతో పాటు, కథలో టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని సమాచారం. రామ్ చరణ్ స్వయంగా ఈ సీన్‌లో పాల్గొంటుండటంతో, అభిమానులు మరింత ఎగ్జయిట్ అవుతున్నారు.

ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ రామ్ చరణ్ కు జోడిగా నటించనుండటంతో ఈ కాంబినేషన్‌పై కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు షూటింగ్ యూనిట్ ఏ మాత్రం విరామం లేకుండా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, "పెద్ది" చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న బజ్‌ను బట్టి చూస్తే, రామ్ చరణ్ మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నారన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా ఈ రైల్వే ఫైట్ సీన్ ప్రేక్షకులను థియేటర్లలోకి ఆకర్షించే ప్రధాన కారణంగా మారవచ్చు.

Tags

Next Story