వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన ‘పుష్ప 2’

ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సెన్సేషన్‌గా నిలిచిన చిత్రం – పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే రికార్డులు బ్రేక్ చేస్తూ, ఇప్పటివరకు ఇండియన్ సినిమా అంతటిలో రెండో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు రూ.1800 కోట్ల ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు దక్కడం విశేషం.
రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో, సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా, ఇందులో పుష్ప 2 రీలోడెడ్ అనే ప్రత్యేక ఎక్స్‌టెండెడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ 13 న స్టార్ మా ఛానెల్ లో సాయంత్రం 5:30కు ప్రసారం కాబోతోంది. ఇంకా.. ఏసియానెట్ మలయాళం చానల్ లో అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు, కలర్స్ కన్నడ టీవీలో సాయంత్రం 7గంటలకు, ఏప్రిల్ 14న తమిళ స్టార్ విజయ్ ఛానల్ లో మధ్యాహ్నం 3 గంటలకు ‘పుష్ప 2’ చిత్రం ప్రసారం కాబోతుండడం విశేషం.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, మాటలు కూడా ఆయనే రచించారు. శ్రీకాంత్ విస్సా మాటలు అందించగా, మిరోస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తరఫున నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ భాగస్వామిగా ఉంది. కర్తీక శ్రీనివాస్, రూబెన్ కలిసి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
-
Home
-
Menu