పూరి జగన్నాథ్ తనయుడి కొత్త ప్రయత్నం!

X
పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ ఇప్పుడు 'తల్వార్' అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఆకాష్ చేసిన సినిమాలు వాణిజ్యపరంగా విజయాన్ని సాధించకపోయినా, నటుడిగా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. కాశీ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ గ్లింప్స్ రిలీజయ్యింది. ఆకాష్ వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనసూయ, అజయ్ వంటి నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆకాష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందేమో చూడాలి. ఈ మూవీ గ్లింప్స్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ షేర్ చేశారు.
Next Story
-
Home
-
Menu