పూరీ - సేతుపతి చిత్రానికి టైటిల్ ఇదేనా?

పూరీ - సేతుపతి చిత్రానికి టైటిల్ ఇదేనా?
X
మొదట్లో ఈ సినిమా టైటిల్ ‘బెగ్గర్’ అని టాక్ నడిచింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘భిక్షాం దేహి’ అనే టైటిల్‌ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా అధికారికంగా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ స్టైల్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేయబోతున్నట్టు బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఇండస్ట్రీలో సందడి చేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పూరి స్వయంగా నిర్మిస్తూ, తన బెస్టీ చార్మీ కౌర్‌తో కలిసి ప్రొడక్షన్ బాధ్యతలు పంచుకుంటున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి సినీ లవర్స్‌లో హైప్ పీక్స్‌లో ఉంది.

మొదట్లో ఈ సినిమా టైటిల్ ‘బెగ్గర్’ అని టాక్ నడిచింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘భిక్షాం దేహి’ అనే టైటిల్‌ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా అధికారికంగా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. సో ఫ్యాన్స్ ఆ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ స్టార్ టబు, కన్నడ స్టార్ దునియా విజయ్, సంయుక్త మీనన్ లాంటి హెవీవెయిట్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ నెల చివర్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. పూరి జగన్నాథ్ రాంగ్ టైమ్‌లోనూ రాకెట్‌లా దూసుకెళ్లే సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్‌తో జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి, ఈ కాంబో నుంచి ఏ రేంజ్ సినిమాటిక్ మ్యాజిక్ చూడబోతున్నామో, ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. మరి ఈ మూవీ టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Tags

Next Story