చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రియాంకా చోప్రా

చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రియాంకా చోప్రా
X
చిలుకూరు బాలాజీ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వీసాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.




ప్రియాంక ఇటీవల లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. ఈ సందర్శన రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రానికి సంబంధించి అని భావిస్తున్నారు. ఆమెను ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.




ఈ ప్రాజెక్టు ఇటీవల ప్రారంభమైంది. ప్రియాంక పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా, మహేశ్ బాబు, రాజమౌళి హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా కాస్టింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. చిలుకూరు బాలాజీ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.



Tags

Next Story