తిరిగి హైదరాబాద్ షూటింగ్ కు ప్రియాంకా చోప్రా

గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా నెల రోజుల విరామం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘యస్ యస్ యంబీ 29’ చిత్ర షూటింగ్‌ను కొనసాగించబోతోంది. ఈ షెడ్యూల్‌లో ఆమె మళ్లీ చేరనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక అడ్వెంచర్ ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నారు. ఇది ‘ఇండియానా జోన్స్’ తరహా పాత్రగా చెబుతున్నారు.
ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇప్పటికే జనవరి, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో.. మార్చిలో ఒడిశాలో జరిగిన రెండు షెడ్యూళ్ళలో పాల్గొంది. ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాన్ని రాజమౌళి వివిధ అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇందులో కెన్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.
ఇందుకోసం రాజమౌళి ఇటీవలే తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సును రిన్యూ చేసుకున్నారు. గురువారం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కనిపించారు. శుక్రవారం ప్రియాంకా చోప్రా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం గ్లోబల్ వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో “క్రిష్ 4” లో కూడా నటించనున్నట్లు వార్తలున్నాయి.
-
Home
-
Menu