ప్రియాంక పారితోషికం అంత డిమాండ్ చేసిందా?

ప్రియాంక పారితోషికం అంత డిమాండ్ చేసిందా?
X
మొదట ప్రియాంక ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ కోరినప్పటికీ.. చిత్ర బృందం చక్కటి చర్చలు జరిపి ఈ మొత్తాన్ని ఫైనల్ చేసిందని అంటున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లోని భారీ పాన్-వరల్డ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా ఖరారైందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా.. ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండి చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ఆమె పారితోషికంగా 30 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రియాంక ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ కోరినప్పటికీ.. చిత్ర బృందం చక్కటి చర్చలు జరిపి ఈ మొత్తాన్ని ఫైనల్ చేసిందని అంటున్నారు.

రాజమౌళి ప్రాజెక్ట్‌ అంటే నిర్మాతలకు ఎలాంటి ఆందోళన ఉండదు. సినిమా బాక్సాఫీస్ ఫలితమేం అయినా, రాజమౌళి మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ వల్ల ముందే టేబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. థియేటర్స్ నుంచి ఓటీటీ వరకు, సినిమా ప్రమోషన్ విషయంలో కూడా రాజమౌళి స్వయంగా బాధ్యత తీసుకుంటారు. ఈసారి మహేష్ బాబు లాంటి సూపర్‌స్టార్‌తో ఆయన కలిసి పని చేయడం, ఏ నిర్మాతకైనా కలల కాంబినేషన్‌.

ఈ సినిమాను అఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రూపొందించబోతున్నారని టాక్. అందుకే చిత్రబృందం కొన్ని అంతర్జాతీయ నటీనటులను ఈ ప్రాజెక్ట్‌కి తీసుకురావాలని చూస్తోంది. ప్రియాంకా చోప్రా వంటి గ్లోబల్ స్టార్‌ ఉండటం వలన.. సినిమా ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ రేంజ్ లో కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Tags

Next Story