SSMB29 లో పృథ్వీరాజ్ ఎంట్రీ – నిజమేనా?

SSMB29 లో పృథ్వీరాజ్ ఎంట్రీ – నిజమేనా?
X


సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మరో కీ రోల్ లో కనిపించబోతుంది. SSMB29 గురించి ఈ ఇద్దరి కాస్టింగ్ తప్ప.. మిగతా విశేషాలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ నటించనున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతుంది.





ఆ వార్తలకు బలం చేకూర్చేలా తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు పృథ్వీరాజ్. ‘తాను దర్శకత్వ బాధ్యతలన్నీ ముగించుకుని, నటుడిగా కొత్త ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నానని, త్వరలో ఓ పరభాషా చిత్రంలో నటించనున్నానని‘ పృథ్వీరాజ్ తన పోస్ట్ లో తెలిపాడు. అంతేకాకుండా అందులో పెద్ద డైలాగులు ఉన్నాయనే విషయం తనకు కొంత భయంగా అనిపిస్తోందని‘ పృథ్వీరాజ్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు పృథ్వీరాజ్.. పరోక్షంగా SSMB29 గురించి పెట్టినవే అనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే పృథ్వీరాజ్ ‘సలార్‘ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రానుంది. ‘సలార్ 2‘లో పృథ్వీరాజ్ రోల్ ఎంతో కీలకంగా ఉండబోతుంది. ఇక పృథ్వీరాజ్ డైరెక్షన్ లో రూపొందించిన మోహన్ లాల్ ‘ఎంపురాన్‘ ఈనెల 27న విడుదలకు ముస్తాబవుతోంది.

Tags

Next Story