ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ – ప్రభాస్ కోసం రెడీ?

'కె.జి.యఫ్' సిరీస్ తో పరిచయమై.. 'కాంతార, సలార్' చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థగా మారింది హోంబలే ఫిల్మ్స్. ఈ అగ్ర నిర్మాణ సంస్థ ఆమధ్య రెబెల్ స్టార్ ప్రభాస్ తో క్రేజీ డీల్ కుదుర్చుకుంది. ఒకేసారి ప్రభాస్ తో మూడు సినిమాలను నిర్మించేలా ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని అధికారికంగానూ ప్రకటించింది.
ఇప్పటికే ప్రభాస్ తో 'సలార్ 1' చిత్రాన్ని నిర్మించింది హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం 'సలార్ 2' చిత్రీకరణ దశలో ఉంది. ‘సలార్ 2‘ తో పాటు ప్రభాస్ హోంబలే నిర్మించే మరో రెండు చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే టాపిక్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్, హోంబలే కాంబో మూవీస్ డైరెక్టర్స్ గురించి చర్చ మొదలైంది.
ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నాడని.. ఆ చిత్రానికి సంబంధించి ఫోటో షూట్ జరిగినట్టుగా ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందే సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మించబోతుందని ఆ సమాచారం. అలాగే ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లోనూ మరో మూవీని నిర్మించనుందట హోంబలే ఫిల్మ్స్. ఈ రెండు సినిమాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
Home
-
Menu