‘ఓజీ’ లో సత్యదాదాగా ప్రకాశ్ రాజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్, రిడెంప్షన్ థీమ్‌లతో రూపొందుతోంది. ఇప్పటికే మెయిన్ క్యారెక్టర్స్‌ను మేకర్స్ ఇంట్రడ్యూస్ చేశారు.
పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కన్మణి పాత్రలో నటిస్తూ, ఓజస్ ప్రేమికురాలిగా, ఆ తర్వాత అతని భార్యగా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఓమి అనే పాత్రలో ఓజస్‌కు రైవల్‌గా నటిస్తున్నారు. తాజాగా, మేకర్స్ ప్రకాశ్ రాజ్ పాత్ర ‘సత్యదాదా’ లుక్‌ను రివీల్ చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, జల్సా, వకీల్ సాబ్ వంటి హిట్ మూవీస్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ ఎప్పుడూ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పుడు "ఓజీ" కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెల్లవారుజామున 1 గంటకు షోలను అనుమతించడంతో, "ఓజీ" ఓపెనింగ్ డేలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
-
Home
-
Menu