పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కౌంటర్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ 'తమిళనాడులో హిందీని వ్యతిరేకిస్తున్నారేమో, కానీ తమిళ సినిమాలను హిందీలో అనువదించకుండా చూడగలరా? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు, బహుళ భాషలు దేశానికి మంచిది' అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం', అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please.' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఇంతకుముందు కూడా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పలు సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ, సనాతన ధర్మం వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు హిందీ భాషా అంశం ఈ వాదనకు కొత్త కోణాన్ని తీసుకువచ్చింది.
-
Home
-
Menu