ప్రదీప్ రంగనాథన్ నాలుగో సినిమా గ్రాండ్‌ లాంచ్!

ప్రదీప్ రంగనాథన్ నాలుగో సినిమా గ్రాండ్‌ లాంచ్!
X
తన నాలుగో సినిమా కోసం ప్రదీప్.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో చేతులు కలిపాడు ప్రదీప్ రంగనాథన్.

"లవ్ టుడే", "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" వంటి వరుస విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న ప్రతిభావంతుడైన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. తన నాలుగో సినిమా కోసం ప్రదీప్.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో చేతులు కలిపాడు. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.

తాజాగా ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ ఇంటెన్స్ లుక్‌తో ప్రారంభమై.. చివర్లో ఒక చిలిపి ముద్దతో ముగియడం, ఈ చిత్రం న్యూ జెన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది.

ఈ సినిమాలో మలయాళ బ్లాక్‌బస్టర్ "ప్రేమలు" ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. అలాగే, ప్రముఖ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Tags

Next Story