'పెళ్లి కాని ప్రసాద్'కి ప్రభాస్ సపోర్ట్!

'పెళ్లి కాని ప్రసాద్'కి ప్రభాస్ సపోర్ట్!హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు.
సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' కోసం రెబెల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఈ సినిమా ప్రచారానికి ఊతమిచ్చేందుకు పాన్ ఇండియా స్టార్ ముందుకు వచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ విడుదల చేస్తున్నాడు.
ఇంతకు ముందు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రాలతో హీరోగా తన సత్తా చాటిన సప్తగిరి, మరోసారి లీడ్ రోల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. టైటిల్‌ను బట్టి చూస్తే, పెళ్లి కాని వ్యక్తి జీవితంలోని హాస్యభరిత సంఘటనలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu