ప్రభాస్ అండ్ అనుష్క బాక్సాఫీస్ వార్ ?

ప్రభాస్ అండ్ అనుష్క  బాక్సాఫీస్ వార్ ?
X
ప్రభాస్ అండ్ అనుష్క టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వార్ కు తలపడనున్నారని సూచిస్తున్నాయి. వారి రెండు చిత్రాలు, ‘రాజా సాబ్’, ‘ఘాటి’.. ఒకే సమయంలో థియేటర్లలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల అనుష్క మధ్య గొప్ప స్నేహం ఉందని అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ గతంలో కలిసి పనిచేసినప్పటి నుండి వారి గురించి అనేక ఊహాగానాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ చిత్రంలో కలిసి నటించిన తర్వాత అవి మరింతగా పెరిగాయి.

అయితే.. ప్రస్తుతం తాజా పరిణామాలు ప్రభాస్ అండ్ అనుష్క టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వార్ కు తలపడనున్నారని సూచిస్తున్నాయి. వారి రెండు చిత్రాలు, ‘రాజా సాబ్’, ‘ఘాటి’.. ఒకే సమయంలో థియేటర్లలో విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు మొదట ఏప్రిల్‌లో విడుదల అవుతున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే నిర్మాణం, పోస్ట్-ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు చిత్రాలు ఇప్పుడు అక్టోబర్‌లో విడుదల కానున్నాయి.

నిర్మాతలు ప్రతిపాదించిన తాత్కాలిక ప్రణాళిక ప్రకారం.. ఈ చిత్రాలు దసరా సీజన్‌లో, అంటే అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానున్నాయి. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఈ రెండు చిత్రాలు దసరా సీజన్‌లో టికెట్ కౌంటర్ల వద్ద సందడి చేయనున్నాయి. హారర్ కామెడీతో ప్రభాస్ థ్రిల్ చేయబోతుంటే.. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో అనుష్క అదరగొట్టబోతోంది. ఇది ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ గా నిలవబోతోంది.

Tags

Next Story