అనారోగ్యంగా ఉన్నానంటున్న పూజా హెగ్డే

అనారోగ్యంగా ఉన్నానంటున్న  పూజా హెగ్డే
X
ముంబై అపార్ట్‌మెంట్ నుంచి ఓ సరదా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె సోఫాలో కూర్చొని.. తన పెంపుడు కుక్కను ఆప్యాయంగా కౌగిలించుకుంటూ కనిపించింది. అదే సమయంలో, తాను అనారోగ్యంతో ఉన్నట్లు కూడా వెల్లడించింది.

బుట్టబొమ్మ పూజా హెగ్డే.. భాషలకు అతీతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆస్వాదిస్తూ ఇండస్ట్రీలో ఇంకా తన హవా కొనసాగిస్తూ ఉంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు .. తన ముంబై అపార్ట్‌మెంట్ నుంచి ఓ సరదా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె సోఫాలో కూర్చొని.. తన పెంపుడు కుక్కను ఆప్యాయంగా కౌగిలించుకుంటూ కనిపించింది. అదే సమయంలో, తాను అనారోగ్యంతో ఉన్నట్లు కూడా వెల్లడించింది.

ఫ్యాన్స్‌ కు ఈ అప్‌డేట్ ను షేర్ చేస్తూ.. పూజా ఇలా రాసింది.. “అనారోగ్య రోజులు... కొంచెం విశ్రాంతి, కోలుకోవడం అవసరం...” ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ... ఫ్యాన్స్, శ్రేయోభిలాషుల నుంచి వేలాది కామెంట్స్ వచ్చిపడ్డాయి. సోషల్ మీడియాలో చీర్‌ఫుల్, ఎనర్జిటిక్ ప్రెజెన్స్‌కు పేరొందిన పూజాకు, ఆమె అభిమానుల నుంచి ఆప్యాయతతో కూడిన సందేశాలు వెల్లువెత్తాయి.

సినిమాల విషయానికొస్తే .. పూజా హెగ్డే ఇటీవల విడుదలైన రజనీకాంత్ చిత్రం “కూలీ”లో మోనికాగా స్పెషల్ సాంగ్‌లో తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజా హెగ్డే తదుపరి తలపతి విజయ్‌తో కలిసి “జన నాయగన్” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

Tags

Next Story