అవకాశమొస్తే తప్పకుండా నటిస్తాను : పూజా హెగ్డే

అవకాశమొస్తే తప్పకుండా నటిస్తాను : పూజా హెగ్డే
X
శ్రీదేవి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే, అలాంటి పాత్రను పోషించడాన్ని తాను హృదయపూర్వకంగా అంగీకరిస్తానని, అలాంటి గొప్ప నటి జీవితాన్ని తెరపై పోషించటం తనకు గౌరవంగా భావిస్తానని స్పష్టం చేసింది.

అందాల హీరోయిన్, కన్నడ కస్తూరి పూజా హెగ్డే ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఎట్ ప్రెజెంట్ ఆమె చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. అయినప్పటికీ, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకొక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆమె నిశ్చయంగా ఉంది. ఇక మే 1, 2025న థియేటర్లలో విడుదలకానున్న ఆమె హీరోయిన్ గా నటిస్తున్న “రెట్రో” సినిమా కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. తమిళ సూపర్‌స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో పూజా హెగ్డేను మీడియా ప్రతినిధులు “శ్రీదేవి బయోపిక్”లో మీరు నటించే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పూజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె 2019 లో విడుదలైన “గద్దలకొండ గణేష్” సినిమాలో.. దివంగత నటి శ్రీదేవి నటించిన ప్రముఖ పాట “వెల్లువచ్చే గోదారమ్మా”కి రీమిక్స్ రూపంలో నర్తించింది. ఆ పాటలో శ్రీదేవి వేసిన స్టెప్పులు, గెటప్‌ను పూజా తాను సమర్థవంతంగా రీ క్రియేట్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.

ఆ అనుభవం నాకు ఎంతో ప్రత్యేకమని తెలిపిన పూజా, శ్రీదేవి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే, అలాంటి పాత్రను పోషించడాన్ని తాను హృదయపూర్వకంగా అంగీకరిస్తానని, అలాంటి గొప్ప నటి జీవితాన్ని తెరపై పోషించటం తనకు గౌరవంగా భావిస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా, పూజా తమిళం, బాలీవుడ్‌లలో మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ, తన సినీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తోంది.

Tags

Next Story