వైరల్ అవుతున్న ‘పెద్ది’ వర్కింగ్ స్టిల్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రం ‘పెద్ది’ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించ బోతున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సినీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్ నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ముఖ్యంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్వేందు శర్మ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ కీలక షెడ్యూల్ కు సంబంధించిన ఈ పిక్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటో.. ఈ ప్రాజెక్ట్‌పై వారి అంకితభావాన్ని సూచిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘పెద్ది’ ఒక గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ వర్కింగ్ స్టిల్స్ ఈ కథాంశానికి సంబంధించిన రా అండ్ రస్టిక్ లుక్‌ను హైలైట్ చేస్తున్నాయి. బుచ్చిబాబు సానా, ‘ఉప్పెన’ చిత్రంతో తన దర్శకత్వ నైపుణ్యాన్ని చాటుకున్న దర్శకుడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేస్తూ మరో బ్లాక్‌బస్టర్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
బుచ్చిబాబు కథాగమనం, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ నటనా పాటవం, జాన్వీ కపూర్ గ్లామర్ అపీరెన్స్ .. అన్నీ కలగలిసి ఈ చిత్రాన్ని ఒక భావోద్వేగ, యాక్షన్ నిండిన అనుభవంగా మార్చనున్నాయి. దివ్వేందు శర్మ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం. రంగస్థలాన్ని మించిన స్టన్నింగ్ విజువల్స్ తో , అద్భుతమైన కథాకథనాలతో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతోంది. మరి ‘పెద్ది’ మూవీ చెర్రీకి ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.
-
Home
-
Menu