ఢిల్లీలో ‘పెద్ది’ తదుపరి షెడ్యూల్ !

ఢిల్లీలో ‘పెద్ది’ తదుపరి షెడ్యూల్ !
X
జులై రెండో వారంలో, రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో కూడిన ముఖ్యమైన సీన్స్‌ను చిత్రీకరించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు.

‘గేమ్ ఛేంజర్’ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. తదుపరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తూ.. రామ్ చరణ్‌తో తొలిసారి జోడీ కడుతోంది. ఇప్పటికే టీమ్ కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసింది. తదుపరి షూటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

జులై రెండో వారంలో, రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో కూడిన ముఖ్యమైన సీన్స్‌ను చిత్రీకరించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు. త్వరలో టీమ్ నుండి అధికారిక అప్‌డేట్ వస్తుందని భావిస్తున్నారు. పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2025 మార్చి 27న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు కృషి చేస్తున్నారు. మరి పెద్దిగా రామ్ చరణ్ ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి.

Tags

Next Story