‘పెద్ది’ మైసూర్ షెడ్యూల్ బిగిన్స్ !

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్‌లో దాదాపు సగం పూర్తి చేసిన తర్వాత.. ఇటీవల కొత్త లుక్‌ని ట్రై చేశాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్, డైరెక్టర్ బుచ్చిబాబు విజన్‌కి తగ్గట్టు కొత్త స్టైల్ డిజైన్ చేయడానికి హైదరాబాద్‌కి వచ్చారు. కొత్త మేకోవర్ ఫైనల్ అయిన తర్వాత.. టీమ్ తాజాగా మైసూర్‌లో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసింది.
తాజాగా రామ్ చరణ్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. షూటింగ్ కోసం మైసూర్‌కి వెళ్లాడు. 'పెద్ది'లో రామ్ చరణ్ ఒక గ్రామీణ స్పోర్ట్స్‌మన్‌గా నటిస్తున్నాడు. ఒక కారణం కోసం ఎక్స్‌ట్రీమ్‌గా వెళతాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, డైనమిక్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ విలన్‌గా నటిస్తున్నాడు.
'పెద్ది' చిత్రాన్ని వెంకట సతీష్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. టీమ్ రాబోయే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి.. మార్చి 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై బాగా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో బజ్ బాగుంది. రామ్ చరణ్ మునుపటి సినిమా 'గేమ్ చేంజర్' బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. 'పెద్ది' పై అంచనాలు బాగున్నాయి. ఇటీవల రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి.
-
Home
-
Menu