ఒక ఒక్క షూటింగ్... మరో పక్క ఎడిటింగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ “పెద్ది”. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్‌కు ఇంకా ఐదు నెలలకు పైగానే సమయం ఉంది. 2026 మార్చి 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలయ్యాయి. రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఒక పక్క షూటింగ్ జరుగుతుండగానే, దర్శకుడు బుచ్చిబాబు మరో పక్క ఎడిటింగ్ పనులను కూడా స్టార్ట్ చేశాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఈ పేర్లల్ పని వల్ల పోస్ట్-ప్రొడక్షన్ స్మూత్‌గా సాగి.. రిలీజ్ డెడ్‌లైన్‌ను అందుకోవడం సులభమవుతుంది. షూటింగ్, ఎడిటింగ్ రెండూ ఒకేసారి జరుగుతూ టీమ్ రౌండ్-ది-క్లాక్ వర్క్ చేస్తోంది. ఇప్పటివరకు సగానికి పైగా ప్రొడక్షన్ పూర్తయింది. సినిమాను గ్రాండ్ స్కేల్‌లో తీర్చిదిద్దడానికి మేకర్స్ ఎలాంటి కసరత్తూ వదలడం లేదని సమాచారం.
రామ్ చరణ్ స్టార్‌డమ్.. బుచ్చిబాబు బలమైన కథాగమనం కలగలిసి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “పెద్ది”, 2026లో అతిపెద్ద రిలీజ్‌లలో ఒకటిగా రూపొందుతోంది.
-
Home
-
Menu