రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు

రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు
X
కో-ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. 'పెద్ది' ప్లాన్ చేసినట్టుగానే మార్చి 27, 2026న థియేటర్స్‌లోకి రానుందని చెప్పారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'పెద్ది' సినిమా షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. రీసెంట్‌గా మహారాష్ట్రలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద ఒక సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు, ఫ్యాన్స్‌ని ఎగ్జైట్ చేసే కొత్త అప్‌డేట్స్ టీమ్ షేర్ చేసింది. 'డ్యూడ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ, ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.

"తరువాత వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఫస్ట్ సాంగే. ఏఆర్ రెహమాన్ ఒక అదిరిపోయే లవ్ ట్రాక్ ఇచ్చారు. అది త్వరలో బయటికి వస్తుంది," అని ఆయన చెప్పారు ఇదిలా ఉండగా.. కో-ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. 'పెద్ది' ప్లాన్ చేసినట్టుగానే మార్చి 27, 2026న థియేటర్స్‌లోకి రానుందని చెప్పారు.

ఉత్తరాంధ్ర రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న 'పెద్ది' ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నారు. సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

Tags

Next Story