తన మార్షల్ ఆర్ట్స్ సీనియర్ తో పవర్ స్టార్ భేటీ !

సినిమాల్లోకి రాకముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. తన తొలి సినిమాల్లో ఆ నైపుణ్యాలను తరచూ ప్రదర్శించారు. యాక్షన్ కొరియోగ్రఫీ పట్ల ఉన్న మక్కువతో.. ఇటీవల విడుదలైన “హరిహర వీరమల్లు” సినిమాలో సుదీర్ఘమైన యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా రూపొందించారు.
తన మూలాలను గౌరవిస్తూ, నటుడు, రాజకీయ నాయకుడైన పవన్ కల్యాణ్ తాజాగా.. 1990లలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో తన సీనియర్ అయిన రెనీష్ రాజాతో మళ్లీ కలిశారు. పవన్ కల్యాణ్.. ఇటీవల మరణించిన వారి గురువు షిహాన్ హుస్సేని గౌరవార్ధం... రెనీష్ రాజా ఆయన స్కూల్‌ను స్వీకరించినందుకు ప్రశంసించారు.
దానిపై పవన్ స్పందిస్తూ.. “34 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు చెందిన రెన్షి రాజా గారితో మళ్లీ కలవడం చాలా సంతోషంగా, గౌరవంగా అనిపించింది. 1990లలో షిహాన్ హుస్సేని గారి మార్గదర్శనంలో మేము ఒకే కరాటే స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాం. అప్పట్లో రెన్షి రాజా బ్లాక్ బెల్ట్ హోల్డర్ కాగా, నేను గ్రీన్ బెల్ట్‌లో ఉన్నాను. ఇప్పుడు ఆయన షిహాన్ గారి విజన్‌ను అదే స్కూల్‌లో ముందుకు తీసుకెళ్తున్నారు. షిహాన్ హుస్సేనితో మా దీర్ఘకాల సంబంధాన్ని, మార్షల్ ఆర్ట్స్ పట్ల మా ఉమ్మడి అభిరుచిని గుర్తు చేసుకుంటూ చర్చించడం చాలా ఆనందకరమైన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది...” అని తెలిపారు.
-
Home
-
Menu