నార్త్ అమెరికా ప్రీసేల్స్ అదరహో !

నార్త్ అమెరికా ప్రీసేల్స్ అదరహో !
X
ఉత్తర అమెరికాలో, ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రీ-సేల్స్ ఇప్పటికే 1.25 డాలర్స్ తో మిలియన్ మార్కును దాటాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘ఓజీ’ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించడానికి రెడీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది అత్యంత హైప్ సృష్టించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘ఓజీ’. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసి.. తమ అభిమానాన్ని సెలబ్రేషన్స్ గా చాటుకుంటున్నారు.

ఇక ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే కళ్ళు చెదిరే ఫిగర్స్ తో ఓవర్సీస్ లో ప్రీసేల్స్ బిజినెస్ చేసేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో, ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రీ-సేల్స్ ఇప్పటికే 1.25 డాలర్స్ తో మిలియన్ మార్కును దాటాయి. ప్రీమియర్‌లకు ముందే 45,000 కి పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ అద్భుతమైన గణాంకాలు సినిమా గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఘనమైన ఓపెనింగ్ సాధించ నుందని సంకేతమిస్తున్నాయి.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, షామ్, మరియు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బడివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ‘ఓజీ’ ఒక గ్రాండ్ సినిమాటిక్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags

Next Story