‘హరిహర వీరమల్లు’ లేటెస్ట్ అప్డేట్ ఇదే !

‘హరిహర వీరమల్లు’ లేటెస్ట్ అప్డేట్ ఇదే !
X
తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల ప్రారంభంలో మిగిలిన షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ పూర్తిచేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు, సినిమా షూటింగ్‌ల మధ్య స‌మతుల్యత సాధించడంలో స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా.. అనేక మార్పులు చేసినప్పటికీ “హరిహర వీరమల్లు” చిత్రం షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల ప్రారంభంలో మిగిలిన షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ పూర్తిచేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అలాగే.. సినిమా మే చివరిలో లేదా జూన్ ఆరంభంలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

అలాగే. పవన్ కళ్యాణ్ నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా హామీ ఇచ్చారని సమాచారం. ఈ ఏడాది చివర్లో "ఓజీ" సినిమా సెట్స్‌కు తిరిగి వచ్చి మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన "హరిహర వీరమల్లు" మరియు "ఓజీ" చిత్రాల మిగిలిన పనులను పూర్తి చేసి, 2025లో రెండు సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే, ముందుగా “హరిహర వీరమల్లు” చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, నిర్మాత ఏం. రత్నం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. తరచూ జరిగే వాయిదాల వల్ల ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఒప్పందం ప్రకారం నిర్ణయించిన తేదీలో చిత్రం విడుదల చేయాలని ఓటీటీ సంస్థలు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

Tags

Next Story