‘ఓజీ’ మూవీ షూటింగ్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. సుజీత్ డైరెక్షన్‌లో.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కల్యాణ్ టీమ్‌తో కలిసి ఫోటో దిగారు. నిర్మాణ సంస్థ ఈ ఫోటోని షేర్ చేస్తూ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు కన్ఫర్మ్ చేసింది.
సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ కూడా ఓ ఫోటో షేర్ చేసి, ప్రస్తుతం ఫైనల్ ఫిల్మ్ కోసం కలర్ గ్రేడింగ్ జరుగుతోందని, త్వరలో డిజిటల్ ప్రింట్స్ రూపొంది ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌కి పంపిణీ అవుతాయని అప్‌డేట్ ఇచ్చారు.
‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో వెంజెన్స్‌తో నడిచే పవర్‌ఫుల్ మాబ్ బాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఫైర్ స్టార్మ్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్స్‌ని దాటి సంచలనం సృష్టిస్తోంది. ప్రీ-రిలీజ్ హైప్ గట్టిగానే ఉంది. ఉత్తర అమెరికాలో ప్రీ-సేల్ కలెక్షన్స్ ఇప్పటికే 1.4 మిలియన్ డాలర్స్ దాటాయి, 484 లొకేషన్స్‌లో 48,495 టికెట్లు అమ్ముడయ్యాయి. ట్రైలర్ సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది.
The picture we clicked with OG on the last day ❤️🔥
— DVV Entertainment (@DVVMovies) September 13, 2025
Cheers to our amazing men bringing FIREEEE to deliver the BLOCKBUSTER on screens from September 25th 💥#TheyCallHimOG #OG pic.twitter.com/e5hLrPguqq
-
Home
-
Menu