‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ పోర్షన్ పూర్తి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు భారీ ప్రాజెక్ట్‌లు ‘ఓజీ’ అండ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీస్ తో బిజీగా ఉన్నారు. వీటిలో ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుండగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా నిర్మాణంలో ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ కాప్-యాక్షన్ డ్రామాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ఇటీవల ప్రధాన నటీనటులందరితో ఒక సాంగ్ సీక్వెన్స్ చిత్రీకరించారు. రాశీ ఖన్నా, పవన్ కళ్యాణ్ తీసిన సెల్ఫీని షేర్ చేస్తూ, “ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ ముగిసింది. ఆయనతో ఈ సినిమాలో నటించడం నిజంగా గౌరవం, ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం,” అని పేర్కొంది. ఆ ఫోటోలో నిర్మాతలు, ఇతర టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. త్వరలో శ్రీలీల, రాశీ ఖన్నాల సీన్‌ల చిత్రీకరణ జరగనుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి పాట త్వరలో రిలీజ్ కానుంది. ఈ హైప్‌తో కూడిన ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu