మళ్లీ పవన్ - రమణ గోగుల కాంబో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంగీత స్వరకర్త-గాయకుడు రమణ గోగుల జోడీ తెలుగు సినిమా చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్‌లో ఒకటిగా గుర్తుండి పోయింది. వీరి కలయికలో ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’, ‘అన్నవరం’ వంటి సినిమాల్లో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ హిట్ జోడీ మళ్లీ కలిసే అవకాశం ఉందనే బజ్ బలంగా వినిపిస్తోంది. రమణ గోగుల.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం తన గొంతు అందిస్తారని టాక్.
ఈ వార్త ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. వీరి పాత హిట్ సాంగ్స్‌ని గుర్తు చేస్తూ నాస్టాల్జియాను రేకెత్తిస్తోంది. ఇటీవల, రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు’ పాటతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో.. ఆయన పాటలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ ఆల్బమ్ తన కెరీర్‌లోనే బెస్ట్‌లో ఒకటిగా ఉంటుందని ‘సైమా’ అవార్డ్స్‌లో చెప్పాడు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ డాన్స్‌లు ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని హింట్ ఇచ్చాడు. ఇప్పటికే పవన్ స్టైలిష్ డాన్స్ పోజ్‌తో ఉన్న స్టిల్ వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత పెంచింది. రమణ గొంతు, దేవీ సంగీతం, పవన్ ఎనర్జీ కలిస్తే.. ‘గబ్బర్ సింగ్’ సినిమా సాంగ్స్‌లా ఈ సినిమా పాటలు కూడా అభిమానులను అలరిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో పవన్-రమణ రీయూనియన్ నిజమైతే, 2025లో ఇది ఒక భారీ మ్యూజికల్ సెన్సేషన్ అవుతుంద నడంలో సందేహం లేదు.
-
Home
-
Menu