మరోసారి అలాంటి ఫీట్ చేస్తున్న మైత్రీ!

తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ గా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2‘ భారీ విజయంతో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద నిర్మాణ సంస్థగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. పరభాషల్లోనూ భారీ సినిమాలను నిర్మిస్తుంది.
ఈకోవలోనే తమిళంలో అజిత్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ని నిర్మిస్తుంది. తమిళ అగ్ర కథానాయకుడైన అజిత్ తో మైత్రీ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘పై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోవైపు.. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సన్నీ డియోల్ తోనూ ‘జాట్‘ పేరుతో బడా మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రీ సంస్థ. తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న ‘జాట్‘ కూడా ఏప్రిల్ 10న విడుదల కానుండడం విశేషం.
అంటే 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య, ‘వీరసింహారెడ్డి‘ వంటి రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేసి ఘన విజయాలు సాధించింది మైత్రీ. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 10న అలాంటి ఫీట్ చేయబోతుంది. ఈసారి కూడా రెండు చిత్రాలతో విజయాలు అందుకుంటుందేమో చూడాలి.
-
Home
-
Menu