అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న ‘ఓజీ’

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న ‘ఓజీ’
X
కేవలం నాలుగు రోజుల్లోనే “ఓజీ” అడ్వాన్స్ టికెట్ సేల్స్‌లో 500కే డాలర్స్ కంటే ఎక్కువ సంపాదించింది.

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా “ఓజీ” అనూహ్యమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది. సినిమా బాక్స్ ఆఫీస్ సామర్థ్యంపై నిర్మాతలకున్న నమ్మకం, నార్త్ అమెరికా ప్రీమియర్‌ల కోసం రిలీజ్‌కు నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ చేయడంతో స్పష్టమైంది. ఈ రిస్క్ పూర్తిగా ఫలించింది. కేవలం నాలుగు రోజుల్లోనే “ఓజీ” అడ్వాన్స్ టికెట్ సేల్స్‌లో 500కే డాలర్స్ కంటే ఎక్కువ సంపాదించింది.

ఈ అద్భుతమైన ఆరంభం.. రజనీకాంత్ ఇటీవలి “కూలీ” సినిమా రికార్డు-బ్రేకింగ్ ప్రీ-సేల్స్‌ కంటే కూడా పెద్దది. ఈ ట్రెండ్ “ఓజీ” నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా సూచిస్తోంది. ఇండియన్ సినిమాల్లో, ‘కల్కి 2898 ఏడీ, పుష్ప 2, కూలీ, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు తమ ప్రీమియర్ షోల నుండి యూఎస్ లో 3 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ సంపాదించాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే “OG” ఈ ఎలైట్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ ట్రాకర్స్ భావిస్తున్నారు.

సెప్టెంబర్ 24, 2025న ప్రీమియర్ కానున్న “ఓజీ” సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటివరకు ఫైర్‌స్టార్మ్, సువ్వి సువ్వి అనే పాటలు విడుదలయ్యాయి. వాటితో ఫ్యాన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

Tags

Next Story