‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది !

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఓజి' పై ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కి ఫ్యాన్స్‌లో వున్న క్రేజ్ కి కొలమానం లేదు. ఓజి ఒక కొత్త స్థాయిలో పవన్ స్టైల్ ని చూపించబోతుందనే అంచనాలు ఆరంభం నుంచి ఉన్నాయి.
కాగా, ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు కారణాల వల్ల ఆలస్యం కాగా, ఇటీవలే తిరిగి షూటింగ్ కి బరిలోకి దిగింది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడనే ఉత్కంఠ కొనసాగుతుండగానే మేకర్స్ సడెన్ గా ఒక పవర్ ఫుల్ అప్‌డేట్ ఇచ్చారు. అదేమిటంటే.. 'ఓజి' సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్‌లో విడుదల కాబోతుందన్న వార్తను అధికారికంగా ప్రకటించారు.
ఈ అప్డేట్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపై ఎగ్జైట్ కూడా అవుతున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీగా నిర్మిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, స్టైలిష్ టేకింగ్.. మొత్తంగా ఇది పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం అభిమానుల్లో నెలకొంది.
FIRING WORLDWIDE in cinemas on
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025
25th September 2025… 💥💥💥💥
#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
-
Home
-
Menu