‘ఓజీ’ మ్యానియా మామూలుగా లేదు !

‘ఓజీ’ మ్యానియా మామూలుగా లేదు !
X
"హరి హర వీర మల్లు" కి నిరాశాజనకమైన రెస్పాన్స్ రావడంతో, పవన్ కల్యాణ్ అభిమానులు తమ ఆశలన్నీ "OG"పై పెట్టుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. "ఓజీ" సినిమా నిర్మాతలు సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. అయితే, "అఖండ 2" కూడా అదే రోజును టార్గెట్ చేస్తుండడంతో, బాక్సాఫీస్ క్లాష్‌ను తప్పించడానికి ఏ సినిమా వెనక్కి తగ్గుతుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఆసక్తికరంగా.. "హరి హర వీర మల్లు" రిలీజ్‌కు ముందు.. "OG" రిలీజ్ డేట్‌పై అభిమానులు పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "హరి హర వీర మల్లు" కి నిరాశాజనకమైన రెస్పాన్స్ రావడంతో, పవన్ కల్యాణ్ అభిమానులు తమ ఆశలన్నీ "OG"పై పెట్టుకున్నారు.

ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టిస్తూ, అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. కానీ హైప్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ కనిపించిన ప్రతి పబ్లిక్ ఈవెంట్‌లోనూ అభిమానులు "ఓజీ.. ఓజీ" అంటూ నినాదాలు చేస్తూ, తమ ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు.

పోస్ట్-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అభిమానులు నిర్మాత డివివి దానయ్యను సెప్టెంబర్ రిలీజ్‌కు కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. చివరి నిర్ణయం పవన్ కల్యాణ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, "ఓజీ" షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతుంది.. మరి బాలకృష్ణ "అఖండ 2" కోసం నిర్మాతలు మరో రిలీజ్ డేట్‌ను ఎంచుకుంటారేమో చూడాలి.

Tags

Next Story